కొలెస్ట్రాల్ కంట్రోల్ లేకపోతే అంతే!

అధిక కొలెస్ట్రాల్‌..ప్రాణంతకంగా మారుతోంది. ముఖ్యంగా దేశంలో కొలెస్ట్రాల్ కారణంగా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. మనం తీసుకునే అహారం దగ్గరి నుండి నిద్రలేమి సమస్య,వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం వంటికి అధిక కొలెస్ట్రాల్‌కు కారణమవుతున్నాయి.

ముఖ్యంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజెరైడ్స్ లెవల్స్ ఎక్కువగా ఉంటడం గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతున్నాయి. చక్కెర, కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

సమతుల్య ఆహారం, వ్యాయామం, ఔషధాల ద్వారా కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కొలెస్ట్రాల్‌ సమస్య వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యే కాదని చెబుతున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. జీవనశైలి, ఆహారంలో కొలెస్ట్రాల్‌ను పెంచే పదార్థాలు ఉండటం కాఱం కావచ్చు. కాబట్టి కొలెస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టాలంటే ప్రతిరోజు వ్యాయామం, ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తే దీని నుండి బయటపడవచ్చు.