Monday, May 5, 2025
- Advertisement -

ఇస్కాన్ తో సీఎం జగన్ గోపూజ..!

- Advertisement -

గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహిస్తున్న గోపూజలో సీఎం జగన్ పాల్గొన్నారు. తితిదే, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో గోపూజ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇస్కాన్ సహాకారంతో 108 గోవులకు కామధేను పూజను చేశారు.

గోపూజ మహోత్సవానికి వచ్చిన సీఎం జగన్.. మెుదటగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. అనంతరం గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోపూజలో భాగంగా గోమాతకు సీఎం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు..శాలువాతో సత్కరించారు. ప్రజలందరికీ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి, వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -