తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుంది. ఇప్పటికే అనేక మంది నేతలు టీఆర్ఎస్‌లో చేరారు. సాదారణ ఎన్నికల్లో భాగంగా రాహుల్ తెలంగాణాలో పర్యటించారు. కాంగ్రెస్ కీలక నేతలపై టీఆర్‌ఎస్ గురి పెట్టింది. ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ షాక్ నుంచి తేరుకోకముందే కాంగ్రెస్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రరెడ్డి, ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. శనివారం శంషాబాద్ లో జరిగిన రాహుల్ గాంధీ బహిరంగ సభలోనూ సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి అసంతృప్తితోనే ఉన్నారు. మరుసటి రోజే ఆమె కేటీఆర్, కవితను కలవడంతో కాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడ్డారు. సబితా కుటుంబం టీఆర్ఎస్‌లో చేరడానికి అసదుద్దీన్ మద్యవర్తిత్వం వహించినట్లు తెలుస్తోంది. అసదుద్దీన్ నివాసంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి భేటీ అయినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని శతవిధాలా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందే సబిత ఝలక్ ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
- Advertisement -
కాంగ్రెస్‌కు షాక్…గులాబీ గూటికి సబితా…
- Advertisement -
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -