Monday, May 5, 2025
- Advertisement -

జగన్‌కు మేలు చేసిన నోట్ల రద్దు నిర్ణయం..!

- Advertisement -
Currency demonetization actually helped jagan a lot..

విజయవాడ : నోట్ల రద్దు ప్రకటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రూ.500, రూ. 1000 నోట్లను రాత్రికి రాత్రే రద్దు చేయడం వల్ల అప్పటివరకు దాచుకున్న డబ్బులన్నీ పనికిరాని కాగితాల్లా మారిపోయాయి. వంద తర్వాత రెండు వేల నోటే పెద్దది కావడంతో ప్రజలు బాగా ఇబ్బందులకు గురయ్యారు. అయితే ఈ నోట్ల రద్దు అంతకుముందు కూడా జరిగిన విషయం తెలిసిందే…

1979లో రూ. 1000 నోటును ఇలాగే రద్దు చేసింది జనతా ప్రభుత్వం. అయితే ఇప్పటిలాగా అప్పడు పెద్ద సమస్యలేమీ రాలేదు. అందుకు కారణం అప్పట్లో వెయ్యి నోటు చాలా తక్కువ మంది దగ్గర మాత్రమే ఉండేది. దీంతో ప్రజలు అస్సలు ఇబ్బంది పడలేదు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు రద్దైన నోట్లు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇలానే ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ నోట్ల రద్దు వ్యవహారం జగన్‌కు చాలా ఉపయోగపడేలా ఉంది. ఏపీలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగానే ఉన్నాయి. ఏళ్ల తరపబడి దాచుకున్న డబ్బు మొత్తాన్ని ఇప్పడు బ్యాంకులో వెయ్యాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారు. పైగా ఎక్కువ డబ్బు ఉంటే లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచో దాచుకుంటున్న డబ్బుకు లెక్క ఎలా చెప్పాలి? ఏ ఆధారాలు చూపించాలి వంటి అయోమయం ఉంది. పోనీ ఉన్న కొద్ది డబ్బును మార్చుకుందామంటే కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి బ్యాంకులకు చేరుకోవాలి. గంటల పాటు లైన్లో నిలబడాల్సి వస్తోంది. పెళ్లి, ఆరోగ్యం, చావు వంటి అత్యవసర పనులు వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఉండటంతో ప్రజలు తిట్టుకునే పరిస్థితి కూడా ఉండవచ్చు.

దీంతో పాటు గ్రామాల్లో ఉండే బడాబాబులు సైతం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇదివరకటి లానే ఉండే పరిస్థితి వస్తే మాత్రం, సామాన్య జనం ఈ మొత్తం వ్యవహారం వల్ల ఇక ఒరిగిందేంటి అని మరింత అసహనానికి గురయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఏపీలో చంద్రబాబు, బీజేపీలు నోట్ల రద్దును సమర్ధించారు. పైగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఈ నిర్ణయం వెనక టీడీపీ, బీజీపీల కృషి అంటూ పొగుడుతూ ఆ క్రెడిట్‌ను సదరు పార్టీలకు దక్కేలా రోజూ వార్తలు రాస్తున్నారు. ఈ ఇబ్బందులకు వారే కారణమనే ఆలోచన వచ్చే విధంగా చేస్తున్నారు. అయితే ఈ నోట్ల రద్దు విషయంలో సైలెంట్‌గా ఉండి జగన్ చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరించాడు. దీంతో ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారిలో జగన్‌కు ఆదరణ పెరుగుతోంది. దీంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే జగన్‌కే ఎక్కువ లాభం చేకూరనుందనేది ఓ విశ్లేషణ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -