Monday, May 5, 2025
- Advertisement -

ప్రధానమంత్రి ఎన్ని దేశాలకి వెళ్ళారు..!

- Advertisement -

ప్రధానమంత్రి చేపట్టిన విదేశీ పర్యటన(స్పెషల్​ ఫ్లైట్​ రిటర్న్స్​-2) వివరాలను తెలియజేయాలని భారత వాయుసేన(ఐఏఎఫ్​)కు కేంద్ర సమాచార కమిషన్​ ఇచ్చిన ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్​ నవీన్​ చావ్లా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే.. విమానంలో ఉన్న ప్రయాణికుల సంఖ్యను చెప్పడంలో ఇబ్బంది లేదని స్పష్టంచేసింది.

ప్రధానితో పాటు పర్యటించిన మంత్రిత్వ శాఖ అధికారులు, ఇతర ప్రయాణికుల వివరాలను వెల్లడించాలని కోరుతూ సమాచార హక్కు చట్టం(ఆర్​టీఐ) కింద నౌకాదళ మాజీ అధికారి లోకేష్​ కే బాత్రా పిటిషన్​ దాఖలు చేశారు. ఆ వివరాలను దరఖాస్తుదారుడికి తెలియజేయాలని సీఐసీ గతంలో భారత వాయుసేనను ఆదేశించింది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో ఐఏఎఫ్​ అప్పీలు దాఖలు చేసింది.

ఈ అప్పీలుపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రధానమంత్రి భద్రతా దృష్ట్యా ఆ వివరాలను వెల్లడించకూడదని చెప్పింది. తదుపరి విచారణను 2021, ఏప్రిల్ 12కు న్యాయస్థానం వాయిదా వేసింది. అప్పటి వరకు సీఐసీ ఆదేశాలపై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -