- Advertisement -
చంద్రబాబు నాయుడు గారూ.. ఇక మేం ఆగేది లేదు. విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ తో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకూ మా పోరాటం ఆగదు అని వైఎస్ఆర్ సిపి అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
రైల్వే జోన్ కోసం తాము చేపట్టిన పోరాటానికి ఆరంభమే తప్ప అంతం లేదని ఆయన స్పష్టం చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటిని సాధించే వరకూ తమ పార్టీ విశ్రమించదని,ప్రజల పక్షాన నిలిచి పోరాడుతామని ఆయన అన్నారు. విశాఖలో రైల్వే జోన్ కోసం ఆమరణ దీక్ష చేస్తున్న గుడివాడ అమర్ నాథ్ ను జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు. అనారోగ్య కారణాల రీత్యా అమర్ నాథ్ చేత దీక్ష విరమింపజేశారు. జగనే స్వయంగా నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.