Monday, May 5, 2025
- Advertisement -

బాబు పాసయ్యారా? ఫెయిలయ్యారా?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 18 నెలలయ్యింది. అంటే ఏడాదిన్నర కాలం పూర్తయ్యింది. ఈ టైమ్ లో బాబు ఎలా పాలించారు? పేదల సమస్యలు పట్టించుకున్నారా? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తీర్చారా? అంటూ.. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కింది.

జవాబు మీరే చెప్పండి.. మార్కులు మీరే ఇవ్వండి.. బాబు పాలన ఎలా ఉందో చెప్పండి అంటూ ఇవాళ సాక్షి పేపర్ లో జనాన్ని ఆకట్టుకునేలా వైసీపీ యాడ్ ఇచ్చింది.

జనచైతన్య యాత్రల పేరుతో గ్రామాల్లోకి వెళ్లేందుకు టీడీపీ నేతలు నిర్ణయించడంతో… అంతే స్థాయిలో వైసీపీ నేతలు కూడా ఈ ప్రకటన తో పెద్ద స్కెచ్చే వేశారు. గ్రామాలకు వచ్చే టీడీపీ నేతలను నిలదీస్తూ.. బాబు పాలనకు వారితో కూడా మార్కులు వేయాలని అందులో జనాన్ని కోరారు. 2014లో ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన వాటిలో వంద హామీలను ప్రకటనలో వివరించారు. ఈ చర్య డైరెక్ట్ గా వీధి పోరాటానికి వైసీపీ నేతలు రెడీ అయ్యారు.

ఇప్పుడు.. టీడీపీకి సపోర్ట్ గా ఉండే ప్రజలు ఎలాగూ జన చైతన్య యాత్రలకు అండగా ఉంటారు. ప్రతిపక్షానికి మద్దతుగా ఉండే వాళ్లు అధికార పార్టీని నిలదీస్తారు. ఇది కామనే అయినా.. ఏ పార్టీకి అండగా ఉండకుండా.. తమ పనేదో తాము చూసుకునే న్యూట్రల్ జనాలు మాత్రం.. ప్రస్తుత పరిస్థితిలో ఎవరికి సపోర్ట్ చేస్తారన్నదీ ఏపీ రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది. వైసీపీ ప్రచారానికి జనం నుంచి ఎంతవరకు రియాక్షన్ వస్తుందన్నదీ ఆసక్తిని పెంచుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -