- Advertisement -
త్వరలో మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమని జోస్యం చెప్పారు ఎంపీ విజయసాయిరెడ్డి. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించిన విజయసాయిరెడ్డి..ఏపీలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని…తిరిగి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చిచెప్పారు.
మీడియా ప్రతినిధులు వాస్తవాలను వక్రీకరించడం సరికాదన్నారు. ఒక ఆదివాసి స్త్రీ మనోభావాలను దెబ్బతీయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సంకీర్ణ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీ లేకపోవడం,జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చనే అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి.. మధ్యంతర ఎన్నికల ప్రస్తావనను తీసుకుని రావడం చర్చనీయాంశంగా మారింది.