ఇంగ్లండ్ తో నాటింగ్ హామ్ లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితమిస్తున్నామని కోహ్లీ చెప్పాడు.టీమ్ సభ్యులంతా కలసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపాడు. కేరళ ప్రజలు క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటున్నారని… వారికి మేము అందిస్తున్న చిరు కానుక ఈ విజయమని చెప్పాడు.
బౌలర్లు మరోసారి 20 వికెట్లను పడగొట్టారని కితాబిచ్చాడు. బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసినప్పుడు వారికి సహకారం అందించాల్సిన బాధ్యత జట్టులోని బ్యాట్స్ మెన్ పై ఉంటుందని తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల మంచి ప్రదర్శనకు స్లిప్ క్యాచింగ్ తోడైతే… టెస్ట్ మ్యాచ్ గెలవడం ఖాయమని చెప్పాడు
ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కోహ్లి తన ఇన్నింగ్స్‌ను అనుష్కశర్మకు అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు.‘నేను నా ఇన్నింగ్స్‌ను నా సతీమణి అనుష్కశర్మకు అంకితమివ్వాలనుకుంటున్నాను. ఆమె ప్రోత్సాహం వెల కట్టలేనిది. నేను ఎల్లప్పూడు ప్రశాంతంగా ఉండేలా ఆమె నన్ను ప్రోత్సహిస్తుందన్నారు.