వంట చెరుకు కోసం అడవిలోకి వెళ్లిన ఆదివాసీ మహిళలపై అటవీ సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. వారి బట్టలు ఊడదీసి నీచంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకల పల్లి మండలం రాచన్న గూడెం సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
రాచన్న గూడెం పంచాయతీ పరిధిలోని సాకివాకిలో సుమారు 20 గుత్తికోయ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గుత్తికోయ మహిళలు వంట చెరుకు కోసం సమీపంలోని అటవికి వెళ్లారు. అక్కడ విధులు నిర్వహిస్తున్నఎఫ్ బీఐ సిబ్బంది వారితో అమర్యాదగా ప్రవర్తించారని బాధిత మహిళలు వెల్లడించారు.
సిబ్బంది తమపై దాడి చేయగా పారిపోయామని చెప్పారు. ఈ క్రమంలో ఒక మహిళ సమీపంలోని గుంతలో పడింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి. అయినా కూడా ఆమెను వదలకుండా ఒంటిమీదున్న బట్టలు ఊడదీశారని వారు వెల్లడించారు.
Also Read: పసికందుపై శానిటైజర్ పోసి .. నిప్పంటించిన తల్లి