Sunday, May 4, 2025
- Advertisement -

నెల్లూరులో గ్యాస్ లీక్..11 మందికి అస్వస్థత!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో శ్రిమ్ప్ ప్రాసెసింగ్ యూనిట్‌లో గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో 11 మంది అస్వస్థతకు గురికాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం అనంతవరం సమీపంలోని ఓశ్రిమ్ప్ ప్రాసెసింగ్ యూనిట్‌లో శనివారం అమెనియా గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో గాయపడిన వారిని వెంటనే నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గ్యాస్ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో, స్థానిక గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇర ఇలాంటి ఘటనలు గతంలో పలు చోట్ల జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో, విశాఖపట్నంలోని పరవాడలోని ఓ ఎఫ్లువెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. అయితే 20 నిమిషాల్లోనే మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు, ప్రాణ నష్టం జరగలేదు.

ఇటీవల తిరుమల లడ్డూ కౌంటర్‌లో యుపిఎస్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. 2024 నవంబర్‌లో, అనంతపురం జిల్లాలోని ఒక ప్రయోగశాలలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు క్లోరిన్ గ్యాస్ లీక్ కావడంతో ఒకరు మృతి చెందారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -