Sunday, May 4, 2025
- Advertisement -

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

- Advertisement -

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్. ఇకపై భక్తులు అడిగినన్ని లడ్డూలు ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం అవసరమైన సిబ్బందిని నియమించనుంది. టీటీడీ ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, ఆరు వేల పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేస్తుంటారు.

తిరుమలతో పాటు తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని ఆలయాల్లో లడ్డూ ప్రసాదాన్ని విక్రయిస్తున్నారు. శ్రీవారిని రోజుకు 70 వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటుండగా దర్శనం చేసుకున్న భక్తులకు ఒక లడ్డూను ఉచితంగా ఇస్తున్నారు.

ఇక దర్శనానికి వెళ్లకుండా లడ్డూలు కొనుగోలు చేయాలనుకునే భక్తులకు ఆధార్ కార్డుపై రెండు లడ్డూలను రూ. 50లకు విక్రయిస్తారు. వారాంతాలు, ప్రత్యేక రోజుల్లో తిరుమల లడ్డూలకు అధిక డిమాండ్ ఉంటుంది. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పోటు సిబ్బందికి అదనంగా మరో 74 మంది శ్రీవైష్ణవులతోపాటు మరో పది మంది శ్రీవైష్ణవులు కానివారిని నియమించాలని టీటీడీ నిర్ణయించింది. ఇక శ్రీవారికి ఈ ఏడాదికి హుండీ ద్వారా సుమారు రూ.1300 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -