ఇటీవల నారాలోకేష్ ను రాష్ట్రకేబినెట్ లోని తీసుకోవాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.దీనికోసం టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ కు ఎమ్మెల్సీ పదవి ఇప్పించి ఆ తరువాత కేబినెట్ లోకి తీసుకోవాలనే వాదన వినిపిస్తోంది.దీనిపై చద్రబాబు కూడా వ్యాఖ్యలు చేశారు. లోకేష్ టిడిపి లో చురుకైన కార్యకర్త అని అలాంటి వ్యక్తిని కేబినెట్ లోకి తీసుకుంటే తప్పేంటని వ్యాఖ్యానించడం విశేషం.
తాజాగా టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ దీనిపై స్పందించారు. లోకేష్ ఎమ్మెల్యే గా గెలిచి కేబినెట్ లో చేరాలని అన్నారు. లోకేష్ ను ఎమ్మెల్యే గా చూసేందుకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేస్తానని అన్నారు. లోకేష్ ఒప్పుకుంటే తాను రాజీనామా చేసి లోకేష్ ను అద్దంకి నుంచి భారీ మెజారిటీ తో గెలిపించుకుంటానని అన్నారు. లోకేష్ అద్దంకి ఎమ్మెల్యే గా గెలిస్తే అడ్డంకితో పాటు ప్రకాశం జిల్లా మొత్తం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.