Tuesday, May 6, 2025
- Advertisement -

హరీష్ రావు గారు ఎంత మాట అనేసారు !

- Advertisement -

తెలంగాణా మంత్రి వర్గం లో కొందరు మంత్రుల మీద కెసిఆర్ అసహనం వ్యక్తం చెయ్యడం ఆ తరవాత గవర్నర్ తో సుదీర్ఘ భేటీలు లాంటివి జరపడం తో తెలంగాణా క్యాబినెట్ లో కొత్త కొత్త మార్పులు ఉండబోతున్నాయి అనే ప్రచారం సాగుతోంది. ఈ వాదన కి బలం చేకూర్చుతూ కెసిఆర్ సన్నిహిత వర్గాలు కూడా మార్పులు ఉండబోతున్నాయి అనే చెబుతున్నాయి. అసంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయం లో మంత్రి హరీష్ రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మంత్రి వర్గం లో మార్పులూ చేర్పులు మీద జరుగుతున్నా ప్రచారం మీద మాట్లాడారు.

క్యాబినెట్ లో మార్పులు అనేది అసలు అవాస్తవమైన వార్త అని ఆయన కొట్టి పడేసారు. అదంతా ఒక అభూత కల్పన అని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని తేలిగ్గా తీసేశారు. పనిలో పనిగా మరో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని అలాగే కమిటీల చేపడతామని హరీశ్ రావు అన్నారు. క్యాబినెట్ లో మార్పులు ఉండవు అనేది స్వయంగా కెసిఆర్ మేనల్ల్లుడు హరీష్ చెప్పడం హిట్ లిస్టు లో ఉన్న మంత్రులకి శుభవార్తే కానీ ఆశావహుల కి మాత్రం ఇది భారీ చేదు వార్త.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -