Sunday, May 4, 2025
- Advertisement -

జగన్ కు మంత్రి హరీష్ హెచ్చరిక

- Advertisement -

తెలంగాణ ప్రభుత్వంపై, ఇక్కడ ప్రాజెక్టుల నిర్మాణంపై ఎపిలో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జలదీక్షపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు  ఫైర్ అయ్యారు. బిడ్డా మానుకోట గుర్తు తెచ్చుకో. మాతో గేమ్స్ వద్దు అంటూ ఆయన మండిపడ్డారు.

జగన్ రాజకీయ లబ్ది కోసమే దీక్షలు చేస్తున్నారు తప్ప నిజానికి తెలంగాణ వల్ల ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవని ఆయన అన్నారు. జలదీక్ష పేరుతో జగన్, మరోవిధంగా చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయాలనుకుంటున్నారని, వారి కుట్రలను తిప్పికొడతామని హరీష్ రావు అన్నారు.

ఇంతకు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నో పాపాలు చేసిందని, వాటిని కడిగేసేందుకే తాము ప్రాజెక్టుల రీడిజైన్ చేశామని మంత్రి అన్నారు. వై.ఎస్.రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగా చేపట్టిన కార్యక్రమాల వల్ల తెలంగాణ ప్రజలు ఇబ్బందుల పాలయ్యారని మంత్రి విమర్శించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -