- Advertisement -
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కింద్రాబాద్‌తో పాటు జంట నగరాల పరిధిలోని అనేక ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం కురియడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
అమీర్‌పేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్, ఎస్‌ఆర్‌నగర్, మధురానగర్, కోఠితో పాటు పంజాగుట్ట, బషీర్‌భాగ్, అబిడ్స్, నారాయణగూడ, చంపాపేట, సరూర్‌నగర్, మలక్‌పేట ప్రాంతాల్లో వర్షం పడింది.
అలాగే సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట, చిలుకలగూడ, మారేడ్‌పల్లితో పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం నమోదైంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఉదయం, మధ్యాహ్నం ఎండలు… రాత్రంతా వర్షం కురుస్తుండటం విశేషం.