Tuesday, May 6, 2025
- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌భుత్వనికి హైకోర్టు షాక్‌..!

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది.రాష్ట్రంలో జ‌ర‌గాల్సిన పంచాయితీ ఎన్నిక‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా వేసుకుంటు వ‌స్తుంది టీడీపీ ప్ర‌భుత్వం.దీనిలో భాగంగానే రాష్ట్రంలోని పంచాయితీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 90ను ఈ రోజు హైకోర్టు కొట్టివేసింది. మూడు నెలల్లోగా అన్ని పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.ఆంధ్రప్రదేశ్ లోని పంచాయితీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగించడాన్ని సవాలు చేస్తూ కొంతమంది మాజీ సర్పంచులు హైకోర్టును గతంలో ఆశ్రయించారు. అధికారుల ద్వారా పాలన నిర్వహించడం అన్నది రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.

వెంటనే ఈ జీవోను కొట్టివేసి, ఎన్నికలు నిర్వహించాలని కోరారు. వాదనలు విన్న హైకోర్టు ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవో 90ని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.వచ్చే 3 నెలల్లోగా పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇప్ప‌టికే టీడీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఎక్కువుగా ఉంద‌ని ప్ర‌తిప‌క్షలు భావిస్తున్నాయి.మ‌రో మూడు నెల‌ల్లో నిర్వహించే ఎన్నిక‌ల ద్వారా రాబోవు ఎన్నిక‌ల‌లో ఎవ‌రు విజ‌యం సాధిస్తారో తెలిసిపోతుంద‌ని రాజ‌కీయ విశ్లేషుకులు భావిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -