ఎన్నికలసు సమయం దగ్గర పడే కొద్ది ప్రకాశం జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా ఒంగోలులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.టీడీపీ, వైసీపీ నేతల పోటీ పోటీ నినాదాలతో ఒంగోలు టౌన్ దద్దరిల్లింది. టౌన్ లోని ప్రధాన ఏరియా అయిన కమ్మపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రారంభోత్సవం పెట్టుకున్నారు వైసీపీ నేతలు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీణివాసులరెడ్డి వచ్చారు. అయితే అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు బాలినేని గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో .. టీడీపీ కార్యకర్తలకు పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒంగోలు టౌన్ లోని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ లో రెండు వర్గాలు పోటీపోటీ ఆందోళనలకు దిగటంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో బాలినేనిని పోలీసులు అడ్డుకోవడంతోపాటు లాఠీ చార్జి చేయడంతో పలువురి వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వైసీపీ కార్యాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించి తీరుతామని బాలినేని అనడంతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
- Advertisement -
వైసీపీ vs టీడీపీ : ఒంగోళులో తీవ్ర ఉద్రిక్తత…
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -