హైదరాబాద్ వేదికగా అందాల పోటీలు జరగనున్నాయి. మే 7 నుండి ప్రారంభమయ్యే మిస్ వరల్డ్ 72వ పోటీలుకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ పోటీల నిర్వాహణ ద్వారా తెలంగాణ టూరిజం..పారిశ్రామిక రంగాల వైపు ప్రపంచ దేశాలను ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తుంది.
దాదాపు 120 దేశాల సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. మే 7 నుంచి 31వరకు ఈ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మిస్ వరల్డ్ అందాల పోటీల్లో పాల్గొనే దేశ విదేశాల ప్రతినిధులకు తెలంగాణ స్వాగతం పలకబోతుంది.
గతంలో న్యూఢిల్లీ, ముంబైలో ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించారు. తొలిసారి హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో టూరిజం శాఖ దేశ విదేశీ పర్యాటకులను ఇప్పటికే ఆహ్వానాలు పంపుతోంది. గొప్ప చేనేత వారసత్వం, అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు, అరుదైన వంటకాలు, విభిన్నమైన కళా వారతస్వమున్న తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను స్వాగతిస్తున్నామని తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్ తెలిపింది.
మిస్ ఇండియా పోటీలకు ఉండే క్రేజ్ మూములు కాదు. అదే మిస్ వరల్డ్ అంటే మాటల్లో చెప్పక్కర్లేదు. ఆధ్యంతం ఆహ్లదకరంగా ప్రపందేశాల ప్రతినిధులను ఆకట్టుకునేలా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చస్తోంది.