Sunday, May 4, 2025
- Advertisement -

నందమూరి హరికృష్ణ.. చంద్రబాబును హెచ్చరించాడా..!

- Advertisement -

ఇప్పటికే తహసీల్దార్ వనజాక్షికి అక్షింతలు వేసి పంపారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొన్న ఆమెపై బాబు మండిపడ్డారు.

టీడీపీ నేతలు తనపై దాడి చేశారిన ఆమె బాధపడ్డా… బాబు ఆమెదే తప్పు అని తేల్చాడు. ఆ విధంగా తెలుగుదేశం వారు ఆ ప్రభుత్వ ఉద్యోగిణి విషయంలో తమదైన శైలిలో వ్యవహరించారు. మరి ఇప్పటికీ వనజాక్షికి బెదిరింపులు ఆగడం లేదు.

ఆమెకు బెదిరింపు లేఖలు, బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయట. ఈ నేపథ్యంలో ఆమె మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తెలుగుదేశం నేతలను ఇబ్బంది పెట్టినందున తనను చంపేస్తామంటూ కొంతమంది బెదిరిస్తున్నారని ఆమె అంటోంది. ఇలాంటి నేపథ్యంలో ఆమెకు అండగా ఉంటానని ప్రకటన చేశాడు నందమూరి హరికృష్ణ. చాలా రోజులుగా ఎలాంటి పొలిటికల్ యాక్టివిటీస్ లోనూ కనిపించని హరి ఇప్పుడు ఈ విషయంలో స్పందించాడు. వనజాక్షికి తన అండ ఉంటుందని ప్రకటించాడు.

మరి ఎంతైనా వనజాక్షి అనే మహిళ బాబుకు ఆగ్రహం కలిగించిన వ్యక్తి. తెలుగుదేశం నేతల అక్రమాలను అడ్డుకొని దాడికి గురైన వ్యక్తి. మరి అలాంటి ఉద్యోగిణికి తాను అండగా ఉంటానని హరి ప్రకటించడం ఆసక్తికరమైన అంశం. మరి ఈ ప్రకటనతో నందమూరి హరికృష్ణ బావ చంద్రబాబుకు కోపం తెప్పించాడేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. తనకు బావ సరిగా ప్రాధాన్యతను ఇవ్వలేదన్న కోపంతో ఉన్న హరి ఆయనకు ఒక హెచ్చరికగానే ఈ ప్రకటన చేశాడేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి అసలు కథ ఏమిటో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -