ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రోజుకో తలనొప్పి ఎందుకు స్టార్టవుతోంది. మొన్నటిదాకా రాజధాని భూముల రగడ, తరువాత పీతల సుజాత పది లక్షల లంచం కేసు, వెనువెంటనే ఎమ్మార్వో వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్ దాడి, ఓటుకునోటు కేసు, పుష్కరాల్లో 30 మందికి పైగా మృతి, మన్యంలో బాక్సైట్ తవ్వకాలు, ప్రత్యేకహోదా వైఫల్యం, తాజాగా కాల్‌మనీ – సెక్స్ రాకెట్ గొడవలు ఇలా వరుస సమస్యలతో ప్రశాంతత లేకుండాపోయింది చంద్రబాబుకు.
అధికారంలోకి వచ్చిన సంతోషం కరిగిపోయింది. రోజుగడిస్తే కొత్త తలనొప్పేం వస్తుందో అని టెన్షన్. ఇంతకీ చంద్రబాబుకు ఎందుకీ పరిస్థితి…. అంటే వైజాగ్ స్వామీజీ చెప్పిందే నిజమంటున్నారు కొందరు. వైజాగ్ స్వామిజీ అంటే శారదాపీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర. రాజధాని అమరావతి శంఖుస్థాపనకు పిలుపు అందుకోని స్వామీజీల్లో ఆయనొకరు. అయితే.. ఆయనే అమరావతి శంఖుస్థాపనకు పెట్టిన ముహూర్తం తప్పని చెప్పారు.
అయినా.. అదేదో శంఖుస్థాపనకు పిలవకపోవడంతో కోపంలో చెప్పిన మాట అని చాలామంది లైట్ తీసుకున్నారు. కానీ.. ఇప్పుడు చంద్రబాబు ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఆయన జోస్యం నిజమవుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. నిజంగానే అమరావతి శంఖుస్థాపనకు పెట్టిన ముహూర్తం తప్పా.? దానివల్లే చంద్రబాబుకు సమస్యలొస్తున్నాయా.? అని నోళ్లు నొక్కుకుంటున్నారు.
నిజానికి ముఖ్యమంత్రి అంటే అతి పెద్ద పదవి! అధికార దర్పం, హోదా, ఎదురులేని పదవిగా పేరు! కానీ.. అదేసమయంలో అదో రాజకీయ కేంద్రం. తన మాటకు ఎదురు ఉండనట్లే.. తన హయాంలో తన పరిధిలో జరిగే ప్రతి సంఘటనకూ, మంచికీ, చెడుకూ తనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ రకంగా చంద్రబాబు ఫేస్ చేస్తున్నది సగటు ముఖ్యమంత్రికి ఉండే సమస్యలే అంటున్నారు ఇంకొందరు.
అయితే.. ఎంత ముఖ్యమంత్రి అయితే మాత్రం చేసే ప్రతిపనీ విమర్శలకు దారితీయడమా అన్న ఆశ్చర్యాలూ వ్యక్తమవుతున్నాయి.ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పోలుస్తున్నారు వారు. కెసిఆర్ కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా..
ఇంత విమర్శలు మాత్రం ఎదుర్కోవడం లేదు కదా అని లాజిక్ లాగుతున్నారు తమ వాదనకు బలం చేకూర్చేందుకు. సరే ఇవన్నీ పక్కనబెడితే.. చంద్రబాబుకు 2016లో పదవీగండం ఉందన్న వార్త ఒకటి హల్‌చల్ చేస్తోంది. మరి ఇదంతా కరెక్టే అయితే.. 2016లో తెలిసిపోతుంది కదా!