సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ పోటీచేసె విషయంపై ఎట్టకేలకు టీడీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవిలో కొనసాగుతున్న చినబాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉబలట పడుతున్నారు. కొడుకు నిర్ణయానికి తగ్గట్టుగానె కొడుక్కి బాబు టికెట్ కేటాయించినట్లు సమాచారం. ఈ సారి లోకేష్ మంగళగిరినుంచి పోటీ చేస్తారని టీడీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. అనేక సమీకరణాల తర్వాత మంగళగిరి నుంచి లోకేష్‌ను బరిలోకి దించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా లోకేష్ పోటీపై అనేక వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పం, కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి కూడా పోటీ చేస్తారనె ప్రచారం జరిగింది. తర్వాత కూడా లోకేశ్ భీమిలి నుంచి పోటీ చేస్తే తాను ఆ స్థానం వదులుకుంటానని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడంతో అక్కడనుంచే చినబాబు పోటీ చేయడం ఖరారయ్యిందనే వార్తలు వచ్చాయి. దీంతో ఘంటా శ్రీనివాసరావు అలగడంతో ఇప్పుడు బాబు మనసు మార్చుకున్నారు. అదే విధంగా లోకేష్ అమరావతినుంచి పోటీ చేయాలని పార్టీ శ్రేణులు కోరడంతోనే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -
లోకేష్ పోటీపై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్టానం..పోటీ ఎక్కడనుంచంటే….?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -