- Advertisement -
ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌తో పాటు ఖమ్మంలోని నివాసంతో పాటు పొంగులేటికి సంబంధించిన కనస్ట్రక్షన్స్, ప్రాజెక్ట్ కార్యాలయాలపై దాడి చేసి ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత తెలంగాణలోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెరాసలో చేరారు. హైదరాబాద్‌లో ఆరుచోట్ల, ఖమ్మంలో పన్నెండు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఎంపీ ఇంటిలోకి ఎవరూ ప్రవేశించకుండా రెండు గేట్లను మూసివేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.