తెలంగాణ రాజకీయాల్లో కొన్నాళ్లుగా కనిపించని తెర వెనక మంత్రాంగం జరుగుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో.. టీఆర్ఎస్ కు పోటీగా రాజకీయ జేఏసీని ముందుండి నడిపించిన రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరాం.. కొత్త రాజకీయ శక్తికి కేంద్రంగా మారుతున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వంపై డైరెక్ట్ గా విమర్శలు చేయకుండా… సున్నితంగా ఉన్న విషయాన్ని ఉన్నదున్నట్టు చెప్పడంలో ఎక్స్ పర్ట్ అయిన ప్రొఫెసర్.. ఇప్పుడు అన్ని పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నట్టు.. ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తోంది.
ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలే కాదు.. కొన్ని విషయాల్లో కోదండరాం సార్ కూడా టార్గెట్ చేస్తున్న విషయం…. పత్రికలను, రాజకీయాలను ఫాలో అయ్యే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలకు సంబంధంచిన విషయంపై… ఈ మధ్య హై కోర్టులో కోదండరాం పిటిషన్ వేయడం.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యువతకు ఉపాధి అవకాశాలపై ఓ కార్యక్రమంలో మాట్లాడిన ప్రొఫెసర్.. రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగ యువతీయువకులు నిరాశలో ఉన్నారని కామెంట్ చేయడం వెనక అసలు ఉద్దేశం ఏంటన్న చర్చ కూడా జరుగుతోంది.
ఇన్నాళ్లూ ఉద్యమం.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపైనే ఫోకస్ చేసిన కోదండరాం.. కొన్నాళ్ల క్రితం ఉద్యోగ బాధ్యతల నుంచి రిటైర్ అయ్యారు. ఇక సమయం అంతా.. రాష్ట్రంలో ప్రజల సమస్యలపై కాన్సన్ ట్రేట్ చేస్తానని అప్పుడే ప్రకటించారు. అప్పటి నుంచి.. ఒక్కొక్కటిగా ప్రజా సమస్యలపై గళం పెంచుతున్నారు. కోదండరాం దూకుడు చూస్తుంటే… ఫ్యూచర్ లో డైరెక్ట్ రాజకీయాల్లో ఆయన ఎంట్రీ కచ్చితంగా ఉంటుందన్న వాదన ఊపందుకుంటోంది. ఏ రాజకీయ పార్టీతో తమకు సంబంధం లేదన్న రిటైర్డ్ ప్రొఫెసర్ మాటల వెనక అసలు ఉద్దేశం కూడా.. సొంతంగానే.. రాజకీయ శక్తిగా ఎదగాలన్నది అసలు ఆలోచనగా కనిపిస్తోంది.
చూడాలి… తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరాం రాజకీయ రంగ ప్రవేశంపై వినిపిస్తున్న గుసగుసలు ఎంత వరకు నిజమవుతాయో!