Sunday, May 4, 2025
- Advertisement -

కేసీఆర్ పై జగన్ నిప్పులు..!

- Advertisement -

తెలంగాణ సిఎం కే.చంద్రశేఖర్ రావును నడిపిస్తున్నది అక్షరాల చినజీయర్ స్వామి, పెట్టుబడిదారుడైన రామేశ్వర్ రావు లాంటి వాళ్ళేనని….. సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ ఎలియాస్ జగన్ ఆరోపించారు.

రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన హరిభూషణ్ …..మొదటి సారి మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్స్ ముందు మావోయిస్టు ఎజెండాను అమలు పరుస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్….. ఇపుడు మావోయిస్టులను ఏరిపారేయడానికి కంకణం కట్టుకున్నారని హరిభూషన్ అలియాస్ జగన్ మండిపడ్డారు. వీర తెలంగాణలో ప్రజల  సమస్యల పరిష్కారం దిశగా కేసీఆర్ అడుగులు ఎక్కడా కనిపించడం లేదని, కేవలం పెట్టుబడిదారుల కోసమే ఆయన పని చేస్తున్నారని  ఆరోపించారు. ఇది ప్రజల తెలంగాణ ఎంతమాత్రం కాదని ప్రజలు, ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాటానికి అందరూ  సిద్దం కావాలని హరిభూషణ్ పిలుపునిచ్చారు.

 

{youtube}MnKhhukUGLg{/youtube} 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -