Sunday, May 4, 2025
- Advertisement -

ప్రజల కోసం జగన్.. ఇది చదివితే జగన్ అభిమాని కన్నీళ్లు పెట్టుకోవడం పక్కా..!

- Advertisement -
YS Jagan Meet Mirchi Formers Guntur Mirchi Yard

ఏపీ ప్రజలకు జగన్‌ పెద్ద దిక్కుగా కనిపిస్తున్నాడు. ప్రజలు జగన్‌ ఒక్కడే తమ సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తారని భావిస్తున్నారు. మొన్న చేనేత కార్మికులైనా, హోంగార్డులు, పోలీసులైనా, నిన్న అగ్రిగోల్డ్ బాధితులైన ఇవాళ మిర్చిరైతులు అయినా తమ కష్టాలను తమ నాయకుడికి చెప్పుకుంటే కాస్తన్నా న్యాయం జరుగుతందని భావిస్తున్నారు..మిర్చిరైతుల బాధలను వినడానికి గుంటూరు మిర్చియార్డ్‌కు జగన్ వచ్చారు. అయితే రైతులు.. నిన్నటి వరకు మార్కెట్‌లో 14 వేలకి క్వింటా అమ్మేవారు. సడన్‌గా నిన్నటి నుంచి 4 వేలకు పడిపోయింది. దాంతో రైతులకు కష్టాలు ఏర్పడ్డాయి.

ఇదేంటి అని మార్కెట్ యార్డ్ అధికారులను అడిగితే.. నచ్చితే అమ్మండి లేకుంటే మీ సరుకు తీసుకుని వెళ్లిపోండి అంటూ ఖరాకండిగా చెప్పేశారు. మొన్నటికి మొన్న వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు దగ్గర మిర్చి ధర తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేయగా.. రైతుల దగ్గర గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయిస్తామని హామీ ఇచ్చాడు. అయితే ఆ హామీ దిశగా ఎలాంటి ఫలితం కనిపించలేదు. దాంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ విషయం పై ప్రతిపక్ష నాయకుడు జగన్‌కు తమ సమస్యలను చెప్పుకోవాలనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జగన్ వెంటనే మిర్చిరైతన్నలను కలిసేందుకు వచ్చారు. మిర్చియార్డ్‌లో ఒక్క నిమిషం కూడా ఎవరు ఉండలేరు.. ఎందుకంటే ఆ ఘాటుకు కళ్లు మంటలు, దగ్గు, తుమ్ములతో ఉక్కిరిబిక్కి అవుతారు. ప్రతి రోజు అక్కడ ఉండే వారికి మాత్రం ఫర్వాలేదు కానీ.. కొత్తవారికి అయితే పెద్ద నరకమే. జగన్ మిర్చియార్డ్‌ కి రావడంతో మిర్చిరైతులు అక్కడికి పోటెత్తారు. మరో వైపు గుంటూరులో ఎండ సుర్రుమంది.

వందలాది మంది గుమిగూడడంతో మిర్చిఘాటుకు ఆ ప్రాంతమంతా తుమ్ములు, దగ్గులమయం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ బయట ఎక్కడన్న  రైతుల ముఖాముఖిగా మాట్లాడోచ్చు. కానీ జగన్ అక్కేడ గంటన్నర సేపు రైతుల బాధలు విని తెలుసుకున్నాడు. జగన్ ని చూసిన రైతన్నలంతా ఒక్కసారిగా బోరుమన్నారు. 14 వేలు గిట్టుబాటుధర అయిన మిర్చి.. ఇప్పుడు 4 వేలకు పడిపోయింది. ఇంక తగ్గే అవకాశం ఉందని.. మార్కెట్ అధికారులు కుమ్మక్కు అవడంతో ధర పడిపోయిందని జగన్ దగ్గర రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో నకిలీ విత్తనాలు తమకు అంటగట్టారని దీంతో పంట దిగుబడి ఈసారి 60 శాతానికి పడిపోయిందని..ఒక్కో ఎకరానికి లక్షన్నర పెట్టుబడి పెట్టామని..ఇప్పుడు ధర తగ్గడంతో కూలీ రేట్లు కూడా గిట్టుబాటు కావని..ఇక తాము కష్టపడి పండించిన పంట అంతా రోడ్డున పారేయాల్సిందే అని..ఇక ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని రైతులు జగన్‌ ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంకో పక్క మిర్చిఘాటుతో కళ్ల మంటలు, కంట్లో కారుతున్న నీటిని తుడుచుకుంటూ.. దాదాపు గంటన్నర నుంచి రెండు గంటల వరకు రైతుల బాధలను ఓపికగా విన్నారు జగన్. 

ఈ క్రమంలో కనీస గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వంతో మాట్లాడుతానని మిర్చిరైతులకు జగన్ హామీ ఇచ్చారు. తమ కోసం ఇప్పటి వరకు ఏ నాయకుడు ఇంత ఓపికగా తమ బాధలను వినలేదని.. జగన్ కూడా నిజమైన రైతు బిడ్డ అని మిర్చిరైతులు అంటున్నారు. గంటన్నరసేపు గుంటూరు మిర్చియార్డ్‌లో రైతన్నల కోసం నరకయాతన అనుభవించిన జగన్‌ను చూసి రైతన్నలు, ఆయన అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రజల సమస్యల గురించి పోరాడే వ్యక్త్ జగన్ అని ప్రతి ఒక్కరూ నినదిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -