Friday, March 29, 2024
- Advertisement -

ఏపీలో ఊపందుకున్న కామెడీ ఎన్నికల స‌ర్వేలు…..

- Advertisement -
Janasena party get eighty seats in 2019 elections in new poll servey

ప్ర‌స్తుతం దేశంలో ఎక్క‌డ చూసినా ఎన్నిక‌ల స‌ర్వేలు కామెడీని పండిస్తున్నాయి.ఎన్నిక‌ల స‌మ‌యం ఇంకా దాదాపు రెండు సంవ‌త్స‌రాలు ఉన్నా ఇప్ప‌టినుంచే స‌ర్వేల ప్ర‌చారం మొద‌ల‌య్యింది.ఈమ‌ధ్య సర్వేల పేరుతో ఇలా కామెడీచేయడం ఒక్కోరికీ అలవాటైపోతోంది.ఇప్పుడు తాజాగా స‌ర్వేలో జ‌న‌సేన‌కు ఎన్నిసీట్లు వ‌స్తాయో తెలిస్తే నోటిలోనుంచి మాట రాదు.

ఏపీలో ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే.. జనసేన పార్టీకి ఏపీలో 80కి పైగా సీట్లు వస్తాయట.విన‌డానికి కామెడీగాలేదు.ప్రశాంత్ కిషోర్ సర్వే వైకాపా ఓడిపోతుందని తేల్చిందని తెలుగుదేశం పార్టీ అనుకూల వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. తను ఏ సర్వే కూడా చేయలేదని ప్రశాంత్ కిషోరే ప్రకటించేసి.. ఆ ప్రచారానికి తెరదించాడు.
కామెడీ ముగిసింద‌నుకుంటె జ‌న‌సేన ప‌ర్టీ కూడా స్టార్ట్ చేసింది కామెడి.సర్వే ఫలితాలు చూస్తె మ‌రీ కామెడీని త‌ల‌పిస్తోంది.చిరంజీవి ప్ర‌జారాజ్యంపార్టీని స్థాపించి సీఎం అవుదామ‌నుకున్నారు కాని విధి వ‌క్రించింది.కేవ‌లం 18 సీట్లతో స‌రిపెట్టుకొని న‌వ్యుల‌పాలు అయ్యారు.సొంతూరిలో చిరంజీవి ఒక మహిళా అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యాడు.
ఎన్నిక‌ల్లో చిరంజీవికి సొంత కులం అవతల కూడా మద్దతు లభించింది.అలా మద్దతు పలికిన వారి నమ్మకాన్ని వమ్ము చేశాడు మెగాస్టార్. దాని ఫలితంగా పవన్ కల్యాణ్ కు సొంత సామాజికవర్గేతరుల మద్దతు లభించే అవకాశాలు చాలా వరకూ తగ్గిపోయాయి.
ఇలాంటి వాతావరణంలో కూడా జనసేన 80కి పైగా సీట్లు.. సాధించేస్తుంది.. అని ప్రకటించే వారికి హ్యాట్సాఫే చెప్పాలి. ఎనభైకి పైగా సీట్లను సాధించడం కాదు… ఆ మాత్రం స్థానాల్లో జనసేన అభ్యర్థులను నిలబెట్టగలిగితే, అలా నిలబడిన వారు డిపాజిట్లు సాధించగలిగితే అదే ప‌వ‌ణ్‌కు పెద్ద విజ‌యం.

Also read

  1. జ‌న‌సేన‌లోకి ఆలీ.. అక్క‌డ టిక్కెట్టు ఫిక్స్..?
  2. తెలంగాణ లో జనసేన అధ్యక్షుడుగా నితిన్..?
  3. జనసేనలో మొదటిసారిగా పవన్ ఇలా..
  4. ఏపీ రాజ‌కీయాల‌కు అత‌నే బెస్ట్‌….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -