Sunday, May 4, 2025
- Advertisement -

వెలగపూడి నుంచి వెళ్లిపోయిన జపాన్ సభ్యులు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని, తాత్కాలిక సచివాలయం నిర్మిస్తున్న వెలగపూడిని సందర్శించేందుకు వచ్చిన జపాన్ సభ్యులు అర్ధాంతరంగా వెళ్లిపోయారు. మంగళవారం నాడు జపాన్ నుంచి వచ్చిన సభ్యులు వెలగపూడిలో నిర్మిస్తున్న కట్టడాలను, ఇతర పనులను పర్యవేక్షించాల్సి ఉంది.

అయితే విజయవాడ నుంచి వెలగపూడి వచ్చిన జపాన్ సభ్యులు కనీసం వారు వచ్చిన బస్సులోంచి కూడా దిగకుండా వచ్చిన తోవనే వెళ్లిపోయారు. దీంతో అక్కడున్న అధికారులు అవాక్కయ్యారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అక్కడికి రాలేదు. జపాన్ సభ్యులు వెళ్లిపోయిన తర్వాత అక్కడికి చేరుకున్న సిఎం అక్కడున్న అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -