Wednesday, May 7, 2025
- Advertisement -

బాబు ఔట్ డేటెడ్ పొలిటీషియన్.. జగన్ మాట కరెక్టే అన్న జేసీ..!

- Advertisement -

మంగళవారం రోజున ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకల సమావేశాల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి..

ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించిన చేసిన వ్యాఖ్య ఒకటి ఆసక్తికరంగా మారింది.

చంద్రబాబుపై విరుచుకుపడిన జగన్ ..బాబును ఒక ఔట్ డేటెడ్ పొలిటీషియన్ గా అభివర్ణించాడు. బాబు ముసలి వ్యక్తి అయిపోయాడు.. ఆయన తరం రాజకీయాలు ఇప్పుడు చెల్లవు అని తేల్చేశాడు. తాను ఈ తరానికి ప్రతినిధిని అన్న జగన్ బాబు ఔట్ డేటెడ్ అని స్పష్టం చేశాడు.

ఈ సందర్భంగా తెలుగుదేశం అధినేతకు ఆగ్రహం వచ్చింది. తనను ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని జగన్ అనడం పట్ల బాబు బాగా ఫీలయ్యాడు. జగన్ పై ఫైరయ్యాడు. తను ఈ తరానికి మార్గదర్శకుడిని అని బాబు స్పష్టం చేశాడు. అయితే ఒక తెలుగుదేశం నేత, ఎంపీ మాత్రం బాబుతో ఏకీభవించడం లేదు. ఆయనే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. జగన్ కు, బాబుకు పోలిక అవసరం లేదని వ్యాఖ్యానించిన జేసీ బాబును ఔట్ డేటెడ్ అని తేల్చేయడం కూడా విశేషం!

జగన్ కూ, బాబుకు వయసులో చాలా తారతమ్యాలు ఉన్నాయని.. కాబట్టి వారి మధ్య పోలిక వద్దని జేసీ అన్నాడు. జగన్ అన్నట్టుగా బాబు ఔట్ డేటేడ్ అని తేల్చేశాడు. మరి ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రిపై చేసిన విమర్శలను జేసీ దివాకర్ రెడ్డి ఇలా సమర్థించడం విశేషం. అందులోనూ బాబుకు బాగా కోపం తెప్పించిన జగన్ కామెంట్స్ ను జేసీ సమర్థించాడు. మరి ఇదంతా మామూలే అనుకోవాలా? లేక తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో జేసీకి తలంటుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -