- Advertisement -
ఓటుకు నోటు కేసు గుర్తుందా. ఎందుకు గుర్తుండదు. ఎవరు మరచిపోతారు అంటారా. ఇంతకీ ఆ కేసు గుర్తుంటే మత్తయ్య కూడా గుర్తుండి ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో కీలకవ్యక్తి భావించిన మత్తయ్యపై దాఖలైన కేసును హైకోర్టు కొట్టి వేసింది.
ఈ కేసులో మత్తయ్య నాలుగో నిందితుడు. తాను అరెస్టు కాకుండా మత్తయ్య అప్పట్లో స్టే తెచ్చుకున్నారు. అలాగే తనపై నమోదైన కేసును కొట్టి వేయాలంటూ క్వాష్ పిటీషన్ కూడా దాఖలు చేశారు. దీనిపై పూర్తి విచారణ జరిపిన కోర్టు మత్తయ్యపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేసింది. దీంతో మత్తయ్యకు ఓ ప్రధాన తలనొప్పి నుంచి బయటపడ్డారు.