క్రియాశీల రాజకీయాలకి చాన్నాళ్ల నుంచీ దూరంగా ఉంటున్నారు నందమూరి హీరో హరి కృష్ణ. ఆయన ఒక్కసారిగా ఇప్పుడు తెరమీదకి రావడం సంచలనంగా మారింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి లో , తాత్కాలిక రాజధాని విజయవాడ లో ఆయన పర్యటించడం విశేషం. ఈ పర్యటన చూడడానికి సాధారణంగా కనిపించినా కూడా ఇది తెలుగు దేశం పార్టీ కి తీవ్రమైన దెబ్బ వేసేది గా కనిపిస్తోంది అంటున్నారు.
మొన్నటి వరకూ తెలుగు దేశం లో ఎంపీ గా చేసిన హరి కృష్ణ ఇప్పుడు వైకపా వైపు మొగ్గు చూపుతున్నారు అనీ ఆయన ఆ పార్టీ లో చేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనీ తెలుస్తోంది. ప్రస్తుతం వైకాపాలో ఉన్న ఎమ్మెల్యే కొడాలి నానికి హరికృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. హరికృష్ణ నగరంలోకి రావడంతో నాని ఆయనను కలిశారు. అంతేకాదు… ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి వీరిద్దరూ కలిసి ఒకే కారులో వచ్చారు.
అంతే.. ప్రసార మాధ్యమాలు ఈ కలయికపై రకరకాల కథనాలు ప్రసారం చేశాయి. ఇదే సభలో వేదికపై రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూడా హరికృష్ణతో సన్నిహితంగా మెలిగారు. ఇది మరింత చర్చనీయాంశమైంది. జగన్ ఎప్పటి నుంచి హరికృష్ణ నీ ఆయన ద్వారా అయన కొడుకు ఎన్టీఆర్ నీ వైకపా లో జేర్చుకోవాలి అని పావులు కదుపుతున్నారు.
పవన్ కళ్యాణ్ 2019 లో తెలుగు దేశం కి ఆసరాగా ఉంటె తమ తరఫున ఎన్టీఆర్ ఉండాలి అనేది వై ఎస్ జగన్ ప్లాన్. ఆతా ఓకే అయితే హరికృష్ణ కి రాజ్యసభ సీటు ఇచ్చి ఎన్టీఆర్ మద్దతు ని 2019 లో పొందాలి అని కుద్దిరితే ఎన్టీఆర్ ని కూడా తమ పార్టీలో జేర్చుకోవాలని జగన్ ప్లాన్.