ట్రాఫిక్ పోలీసులు ఏకంగా ముఖ్యమంత్రి కారుకే ఫైన్ వేసి సంచలనం సృష్టించారు. అయితే ఇది జరిగింది మన రాష్ట్రంలో కాదు. మన పక్క రాష్ట్రం అయిన కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. చట్టం ముందు అందరు సమానం అని నిరుపించారు కర్ణాటక ట్రాఫిక్ పోలీసులు.కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి చెందిన వ్యక్తిగత కారు ట్రాఫిక్ రూల్స్ ఉల్లఘించినందుకు గాను ఫైన్ విధించారు ట్రాఫిక్ పోలీసులు. దీనిలో భాగంగానే సీఎం కార్యాలయానికి ట్రాఫిక్ విభాగం అధికారులు నోటీసులు జారీ చేశారు.
ముఖ్యమంత్రి కుమారస్వామి కారు పరిమితికి మించిన వేగంతో కారు వెళ్లిందని ట్రాఫిక్ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లఘించినందుకు గానురూ.300 జరిమానా చెల్లించాలంటూ నోటీసులో పేర్కొన్నారు. ఏకంగా ముఖ్యమంత్రి కారుకే ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులను హీరోలుగా చిత్రికరంచి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
- Advertisement -
ముఖ్యమంత్రి కారుకే ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -