Tuesday, May 6, 2025
- Advertisement -

కరుణకు ప్రధాని మోదీ నివాళి… మెరీనాలోనే క‌రుణానిధి అంత్య‌క్రియ‌లు…

- Advertisement -

పలు నాటకీయ పరిణామాల అనంతరం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పార్థివదేహానికి అంత్యక్రియలు జరిపే స్థలంపై ఏర్పడిన వివాదంపై ఎట్టకేలకు మద్రాసు హైకోర్టు తీర్పు వెలువరించింది. కరుణానిధి అంత్యక్రియలు.. చెన్నైలోని మెరీనా బీచ్ లోనే నిర్వహించాలని న్యాయస్థానం తీర్పు వెలువరించింది.హైకోర్టు తీర్పుతో.. పళని స్వామి ప్రభుత్వానికి చుక్కెదురైంది.

చెన్నైలోని మెరీనా బీచ్ లో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసిన తరువాత రాజాజీ హాల్ వద్ద భావోద్వేగాలు పెల్లుబికాయి. ఈ విషయం తెలిసిన వెంటనే, మైకుల ద్వారా అనౌన్స్ చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న స్టాలిన్, అళగిరి, కనిమొళి తదితరులు పెద్దపెట్టున విలపించారు. తండ్రి భౌతికకాయాన్ని ఉంచిన శవపేటికను పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు.

రాజాజీ హాల్ కు ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ కరుణానిధి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కరుణానిధి పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచిన మోదీ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా డీఎంకే శ్రేణుల నినాదాలతో రాజాజీ హోల్ హోరెత్తింది. కరుణకు నివాళులు అర్పించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యల్ని మోదీ ఓదార్చారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ వెన్ను తట్టి ధైర్యం చెప్పారు.

ప్రధాని మోదీ వెంట రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఉన్నారు. శరీర అవయవాలు సహకరించకపోవడంతో కరుణానిధి మంగళవారం సాయంత్రం 6.10 గంటలకు తుదిశ్వాస విడిచారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -