మహిళలపై రోజు రోజుకి హత్యాలు,హత్యాచారాలు పెరిగిపోతున్నాయి.తాజాగా పక్కింటిలో ఒంటరిగా ఉన్న మహిళ మీద అర్దరాత్రి అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించిన యువకుడికి తగినశాస్తి చేసింది ఆమహిళ. కామంతో రెచ్చినపోయిన యువకుడు ఇప్పుడు కేరళలోని కొచ్చి ఆసుపత్రిలో లబోదిబో అంటున్నాడు.
కేరళలోని ఎర్నాకుళం జిల్లా నారక్కల్ పట్టణంలో రాజేష్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రాజేష్ ఇంటి పక్కనే వివాహిత మహిళ నివాసం ఉంటున్నది.అర్దరాత్రి చొరబడి జులై 26వ తేదిన మహిళ భర్త పని మీద ఊరికి వెళ్లాడు. మహిళ ఒంటరిగా ఉందని తెలుసుకున్న రాజేష్ అర్దరాత్రి ఆమె ఇంటిలో చొరబడి అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు.
అదే సమయంలో తనను తాను రక్షించుకొనేదానికి ఆమె చేతికి ఏమీ చిక్కకపోవడంతో లిప్ లాక్ చెయ్యడానికి ప్రయత్నించిన రాజేష్ నాలుకను నోటితో గట్టిగా పట్టుకుని రెండు ముక్కలు చేసింది. నాలుక తెగిపోవడంతో లబోదిబో అంటూ రాజేష్ అక్కడి నుంచి పారిపోయాడు. మరసటి రోజు మహిళ ఫిర్యాదు చేశారని నారక్కల్ పోలీసులు చెప్పారు.
రెండు సెంటీ మీటర్లు రాజేష్ నాలుక కత్తిరించిన మహిళ రెండు సెంటి మీటర్ల నాలుక తమకు అప్పగించిందని పోలీసులు చెప్పారు. అయితే ఇప్పుడు రాజేష్ కు శాస్త్ర చికిత్స చేసి నాలుక అతికించడం కుదరదని వైద్యులు చెప్పారు.తగిన శాస్తి జరిగిందని అక్కడి వారు అనుకుంటున్నారు.
https://www.youtube.com/watch?v=CjF5FciP8ro