అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ మంత్రి కె.తారక రామారావు సాఫ్ట్ బ్యాంక్ ఉన్నతాధికారి నికేష్ అరోరాతో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వీరిద్దరు పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ సాఫ్ట్ బ్యాంక్ సిఈవో నికేష్ అరోరాను కోరారు.
ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న అరోరాకు తెలంగాణలో పారిశ్రామిక విధానం, ఇక్కడ 15 రోజుల్లోనే అనుమతులు లభిస్తున్న తీరు, అందుబాటులో భూమి, మానవ వనరులు వంటి అంశాలపై మంత్రి కె.తారకరామారావు సిఈవోకు వివరించారు.
తెలంగాణలో టి హబ్ తో పాటు ఇతర అంశాలను కూడా సవివరంగా చెప్పిన కెటిఆర్ పెట్టుబడులకు తమ రాష్ట్రం స్వర్గధామం అని వివరించారు. ఈ సమావేశం ఎంతో సామరస్యంగా జరిగిందని, సాఫ్ట్ బ్యాంక్ సిఈవో అరోరా తమ ఆహ్వానాన్ని మన్నించారని మంత్రితో పాటు ఉన్న వారు సమావేశం అనంతరం తెలిపారు.