ఫోటో తీసుకుంటే దెయ్యం వచ్చింది

దెయ్యం అంటే మనం అమ్మో అంటాం.. మన దేశంలో దెయ్యాలు ఉన్నాయని వాదించేవాళ్లు కొందరైతే, మరికొందరు లేవని వాదిస్తారు.

ఫోటోలోకి దెయ్యం దూరింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సెల్ఫీ ఫోటో హల్ చల్ చేస్తుంది. ఇది ఎక్కడ జరిగింది అంటారా? న్యూకేజిల్ ప్రాంతంలో ఇద్దరు అమ్మాయిలు లండన్ బార్?లో సెల్ఫీ తీసుకుంటే.. వాళ్ల అనుమతి తీసుకోకుండానే అతిథిగా వచ్చి ఆ ఫొటోలో దూరిందట.

ఇద్దరు అమ్మాయిల వెనకాల ఓ ‘దెయ్యం’ నిలబడినట్లుగా ఫొటోలో ఉందట. ఈ ఫొటోలో ఉన్న దెయ్యం.. బాగా వృద్ధ మహిళగా కనిపిస్తోందని చెబుతున్నారు. విక్టోరియా గ్రీవెస్, కేలీ ఆట్కిన్సన్ అనే ఇద్దరు అమ్మాయిలు  ఒక బార్‌లో సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు. అయితే, ఫొటోలో తామిద్దరం కాక మరో వ్యక్తి ఉన్నట్లు వెంటనే గుర్తించారు. విక్టోరియన్ దుస్తులు ధరించిన వృద్ధ మహిళ ఆ ఫొటోలో కనిపించింది. 

వెంటనే వాళ్లు ఆ ఫొటోను స్నాప్?చాట్?లో అప్?లోడ్ చేశారు. తర్వాత ఎందుకైనా మంచిదని, తమ ఫోన్లలోంచి డిలీట్ చేసేశారు. కానీ ఆ ఫొటో మాత్రం ఇప్పటీకి వరుసపెట్టి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతూనే ఉంది.