Sunday, May 4, 2025
- Advertisement -

కేసీఆర్ ను విమర్శిస్తే.. వారి పని అంతే ఇక…

- Advertisement -
Man will arrested for posting articles in social media against kcr

తెలంగాణ సీఎం కేసీఆర్ ను విమర్శిస్తే జైలుకే.. అవును ఇది పచ్చి నిజం.. విషయంలోకి వెళ్తే.. సోషల్ మీడియాలో కేసీఆర్ పై వస్తున్న దుష్ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం చూపించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శకులు ఇక పై రావద్దు అని.. సోషల్ మీడియాలో తెలంగాణ సీఎం గురించి లేదా.. తెలంగాణ ప్రభుత్వం గురించి దుష్ప్రచార పోస్టులు పేడితే.. ఇక మీద వారు జైలుకే్.

తెలంగాణ ప్రభుత్వం మీద.. కేసీఆర్ మీద ఈ మధ్య జోరిగా దుష్ప్రచారం జరుగుతోంది.. ఈ దుష్ప్రచారం ఆగాలనే ఉద్దేశంతో ప్రభుత్వ వర్గాలు ప్రజలను హెచ్చరిస్తున్నాయి. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగం రెడీ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ప్రభుత్వ వ్యతిరేకత పేరుతో ప్రతిపక్షాలు కొంత మంది సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు అప్ లోడ్ చేస్తుండటాన్ని టీఆర్ఎస్ వర్గాలు సీరియస్ గా తీసుకున్నాయి.

ఇది కాస్త ఎక్కువ అవ్వడంతో తాజా నిర్ణయం తీసుకున్నారు. అసభ్య పోస్టుల విషయంపై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశామని ఇక నుంచి ఇలాంటి పోస్టులపై ఎప్పటికప్పుడు ప్రత్యేక పోలీసు నిఘా కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఒకరిని కించపరిచే విధంగా పోస్టింగులు పెట్టడం ఆరోగ్యకరం కాదని అంటున్నారు. మరి ఇలాంటి హెచ్చరికతో ఎలాంటి మార్పు వస్తుందో చూడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -