- Advertisement -
టీటీడీకి చెందిన బంగారం తరలింపు వ్యవహారం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. ఈ నెల 17న చెన్నైలోని వెప్పంపట్టు సమీపంలో ఓ వాహనంలో తరలిస్తున్న 1381 కిలోల టీటీడీ బంగారాన్ని ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది పట్టుకుంది. అయితే ఈ బంగారంపై టీటీడీనుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో అనేక అనుమానాలు తలెత్తాయి. దీంతో సీఎస్ విచారణకు ఆదేశించారు.
ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్ సింగ్ దీనిపై విచారణ చేశారు. టీటీడీ ఈవో, విజిలెన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) అధికారులను విచారించారు. అనంతరం నివేదికను సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను మన్మోహన్ సింగ్ కలిసి ఈ నివేదికను ఆయనకు అందజేశారు.