తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడవిడి పూర్తి అయింది.రాష్ట్రంలో పలువురు సెలబ్రిటీలు తమ ఓటు హక్కు నిర్వహించుకుని ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.చిరంజీవి,ఎన్టీఆర్,మహేశ్ బాబు,అల్లు అర్జున్,మొదలగు వారు తమ ఓటు హక్కుని వినియోగించుకున్న వారిలో ఉన్నారు.ఇక్కడ వరకు బాగానే ఉంది కాని మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ మారాయి. ‘‘ఓటు మనకు సంక్రమించిన హక్కు. ఇది ఒక వజ్రాయుధం లాంటిది. మనకు నచ్చిన పార్టీని ఎన్నుకోవాలన్నా.. నచ్చని పార్టీని దింపేయాలన్నా ఓటు ద్వారానే సాధ్యం.
దీన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరిపై ఉంది. ఒంట్లో బాగోలేకో.. కదల్లేని పరిస్థితుల్లోనో ఉన్నవాళ్లు తప్ప ఆరోగ్యంగా ఉండి కూడా ఈ రోజును ఒక సెలవు దినంగానో.. ఎంజాయ్మెంట్ డేగానో పరిగణించి ఓటు వేయకుండా నిర్లక్ష్యం చేస్తే అలాంటి వాళ్లను అస్సలు క్షమించకూడదు. ఓటు వేయని వారిని గాడిదలతో పోల్చారు నాగబాబు.అవినీతి పరుడైన రాజకీయ నాయకుడు కన్నా ఓటు వేయనివారు చాలా దుర్మార్గులని తెలిపారు నాగబాబు.
- క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో నవాజుద్దీన్!
- 60 ఏళ్ల తర్వాతే ఆ సినిమా చేస్తా!
- మహేశ్ బాబుకు షాకిచ్చిన ఈడీ..
- పుష్ప 2..వీఎఫ్ఎక్స్ బ్రేక్డౌన్ వీడియో!
- డ్రగ్స్ రైడ్… మలయాళ నటుడు?