Wednesday, May 7, 2025
- Advertisement -

బాబు,కోడెల మధ్య విబేధాలను బయటపెట్టిన ముద్రగడ పద్మనాభం లేఖ…

- Advertisement -

కోడెల ఆత్మహత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని రోజులుగా నానా హంగామా చేస్తున్నారు. దాన్ని వైసీపీకీ అంటగడుతూ నీచరాజకీయం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం వల్లే కోడెల చనిపోయారని ముసలి కన్నీరు కారుస్తున్నారు. తాజాగా ముద్రగడ పద్మనాభం బాబుకు లేఖ రాయడంతో బండారం బయటపడింది.

లేఖలో బాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు మాటతీరు మారిపోయిందని, చిలుక పలుకులు పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. కోడెల అంతిమయాత్రలో చంద్రబాబు బాగా నటించారని, ఆయన నటనంతా రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు.

పోలీసు వ్యవస్థను నిర్వీర్యం కావానికి కారణం చంద్రబాబు కాదా.. ఎస్.ఐ నుంచి డీజీపీ స్థాయి వరకు బాంచన్ దొర కాలు మొక్కుతా అని తీర్చిదిద్దారు అంటూ మండిపడ్డారు. ధికారంలో ఉన్నప్పుడు కోడెలను పిలిపించుకున్న చంద్రబాబు, మీ కుమారుడి వల్ల చెడ్డపేరు వస్తోంది, అతడ్ని అదుపులో పెట్టండి అంటూ హెచ్చరించగా, మీ పుత్రరత్నం ఏమన్నా వజ్రమా? అంటూ కోడెల ఘాటుగా బదులివ్వడం నిజం కాదా? అని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తె బాబు,పార్టీ వైఖరి వల్లే ఆయన తీవ్ర మనస్థాపానికి గురయి ఆత్మహత్య చేసుకన్నట్లే అన్న వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -