Sunday, May 4, 2025
- Advertisement -

చివరి వరకు పార్టీలోనే ఉంటా!

- Advertisement -

తనపై మీడియాలో వస్తున్న కథనాలపై నెల్లూరు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించారు. నాపై అనవసరంగా ఈరోజు మార్నింగ్ నుంచి ఒక ఛానల్‌లో తను పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రసారం చేస్తున్నారు.వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైయస్ జగన్ కు

ఫ్యాక్స్ ద్వారా పంపానని చెబుతూ ప్రసారం చేస్తున్నారు. ఏదైనా ఉంటే నన్ను అడిగితే మీడియా వారికి సమాధానం చెబుతాను కదా

ఎందుకు ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని ఒక వర్గం మీడియాపై ఆయన ఫైర్ అయ్యారు. మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుంటానని పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

 

మేకపాటి వర్గాలకు మాకు ఎలాంటి విభేదాలు లేవు. మేము కలిసి పని చేసుకుంటున్నామని ఆయన మీడియాకు తెలిపారు. 2012 లో నేను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాను. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తానని చెప్పారు.   

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -