టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి లో తన తండ్రి కూర్చుండ బెడితే కూర్చున్న కుర్ర టీడీపీ లీడర్ నారా లోకేష్ కి గ్రేటర్ ఎన్నికల్లో చుక్కలు కనపడ్డ సంగతి తెలిసిందే. జూన్ లో రాజ్యసభ ఎన్నికలు ఉండడం తో అతన్ని డిల్లీ కి పంపించే యోచన చేస్తోంది టీడీపీ అని మీడియా చెబుతూ ఒస్తోంది.
ఈ విషయం మీద లోకేష్ ఎప్పుడూ స్పందించింది కూడా లేదు. ఇన్నాళ్ళ తరవాత డిల్లీ విషయం మీద మీడియా కి సరిగ్గా సమాధానం చెప్పారు చిన్న బాబు గారు.
“నేను ఢిల్లీ వెళ్లను.. ఢిల్లీ వెళ్లి ఏం చేస్తాను.. ఇక్కడే ఉండి పార్టీని పటిష్టం చేస్తా”నంటూ కుండబద్దలు కొట్టారు లోకేష్. పార్టీ పటిష్టత కోసం కష్ట పడతా అంటున్న లోకేష్ ని కొందరు అడిగే సూటి ప్రశ్న ఏంటంటే .. ” పార్టీ ని బలపరచడం అంటే పక్క పార్టీ ఎమ్మేల్యే లని కొనడమా ” అంటున్నారు. తమ ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేసి టీడీపీ పార్టీ తరఫున గెలివాలని జంపింగ్ నేతలకు జగన్ విసిరిన సవాల్ పై స్పందించిన లోకేష్… వైసీపీ అధినేత అలా మాట్లాడే అర్హతే లేదంటున్నారు. 2009 లో వైఎస్ఆర్ చేసిన ఆపరేషన్ ఆకర్ష్ లో టీడీపీ చేస్తున్నది చాలా తక్కువ అన్నట్లుగా మాట్లాడారు.