Wednesday, May 7, 2025
- Advertisement -

వైసీపీకి సహకరించాడని అధికారిని బదిలీ చేయించిన లోకేష్!

- Advertisement -

ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం దీక్ష చేపట్టినప్పుడు ఆ పార్టీ వాళ్లకు ఢిల్లీలోని ఏపీ భవన్ లో వసతి ఏర్పాట్లను కల్పించాడనే కోపంతో ప్రభుత్వాధికారిపై వేటు వేయించాడు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ బాబు. సమాచార కమిషనర్ హోదాలో ఉండిన రమణారెడ్డి అనే అధికారిని లోకేష్ తాజాగా బదిలీ చేయించాడు. ఇది వరకూ తన పనితీరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మన్నన పొందిన అధికారి ఆయన. అయితే లోకేష్ కు ఆయనపై కోపం వచ్చింది. దీంతో ఆ అధికారి బదిలీ అయిపోయాడు.

రమణారెడ్డి అనే అధికారి తన విధిని తాను నిర్వర్తించాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రజా ప్రతినిధులు ఎవరు ఢిల్లీ వెళ్లినా అక్కడి ఏపీ భవన్ లో వారికి వసతిని ఏర్పాటు చేయడం ఆయన విధి. గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లినప్పుడు కూడా ఈ అధికారి వారి కోసం వసతి ఏర్పాట్లు చేయించాడు. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం నేతలకు అక్కడ రూములు ఇప్పించాడు. మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైకాపా వాళ్లు కూడా రమణారెడ్డి ద్వారా ఏపీ భవన్ లో వసతి పొందారు.

అయితే ఇది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి తనయుడికి ఏ మాత్రం నచ్చలేదు. దీంతో ఆ అధికారిపై వేటు పడింది. ఆయనను తన మాతృశాఖ అయిన రైల్వేశాఖకు పంపించాడు లోకేష్ బాబు. మరి లోకేష్ ఈ విధంగా ప్రత్యేక్ష్యంగా పాలనలో జోక్యం చేసుకొంటుండటం వివాదంగా మారే అవకాశాలు లేకపోలేదు. ఆయన రాజ్యాంగబద్ధంగా ఎలాంటి పదవి లేకపోయినా.. ఇలా రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి ప్రభుత్వ అధికారులను బదిలీ చేయించేంత వరకూ రావడం తెలుగుదేశం పార్టీ నుంచే అసంతృప్తి కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -