- Advertisement -
తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖలకు సంబంధించి పలువురిని సలహాదారులుగా నియమించింది. వీరి పదవి కాలం ఈ నెలతో ముగియనున్నది. దీంతో వీరందరి పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ సలహాదారులుగా నీటి పారుదల రంగ నిపుణులు విద్యాసాగరరావు, మాజీ ఐఎఎస్ అధికారులు రమణాచారి, గోయల్ ఉన్నారు. వీరితో పాటు రామ్ లక్ష్మణ్, పాపారావు, జీఆర్ రెడ్డిల పదవీ కాలాన్ని కూడా పొడిగించారు.