Wednesday, May 7, 2025
- Advertisement -

తగ్గే సమస్యే లేదు – చంద్రబాబు

- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై రెండు విషయాలు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ఒకటి ఓటుకు నోటు కేసు కాగా మరొకటి ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిచేయి ఇవ్వడంతో బాబు అనుసరించే వైఖరి ఏంటనేది. ఈ రెంటిలోనూ తాను ఏ మాత్రం రాజీ పడేది లేదని మరోమారు స్పష్టం చేశారు.

కర్నూలు జిల్లాలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు  రాష్ట్ర హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడే ప్రసక్తే లేదని  స్పష్టం చేశారు. తాను ఎవరికి భయపడేది లేదని నిప్పులాంటి వ్యక్తినని బుల్లెట్ లా దూసుకుపోతానని బాబు పునరుద్ఘాటించారు.స్వప్రయోజనాల కోసం కేంద్రంతో మెతక వైఖరి అవలంబిస్తున్నానని కొంతమంది చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన జరిగిన తీరు వల్ల రాష్ట్రం నష్టపోయిందని బాబు అన్నారు. హోదా కోసం కేంద్రంతో గట్టిగా పోరాడుతున్నామని పునరుద్ఘాటించారు.

అందుకే అభివృద్దిని కాంక్షించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పొత్తుపెట్టుకున్నామని బాబు చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం కావాల్సిన నిధులు ఇవ్వడం లేదన్నారు. ప్రత్యేక హోదా ఊసెత్తడం లేదని – రైల్వేజోన్ కూడా ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఆర్థిక లోటుకూడా భర్తీ చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

పోలవరం ప్రాజెక్టుకు మొత్తం నిధులు ఇవ్వలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పోరాటం చేయడం – దూకుడుగా ముందుకు వెళ్లడంలో తన చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ ప్రయోజనాలు కోసం ఇటు తను ఢిల్లీ పర్యటనలు చేస్తూ అటు హస్తినాలో తన ఎంపీల ద్వారా నిరంతరం సంప్రదింపులతో ముందుకుసాగుతున్నానని వివరించారు.

Related 

  1. చంద్రబాబు తో తలనొప్పి వారికి కాస్త తగ్గింది
  2. చంద్రబాబు గారూ నిద్ర లేవండి
  3. ప్రత్యేక హోదా లేనట్టే .. తేల్చి చెప్పేశారు
  4. టెంపరరీ ప్రత్యేక హోదా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -