Wednesday, May 7, 2025
- Advertisement -

మోడీ అట్టర్ ప్లాప్ అయ్యారు .. ఫ్యూచర్ ఉందా ఆయనకి ?

- Advertisement -
Notes Ban Effect on Common Man

తన మొండి నిర్ణయం తో దేశం ఎంత వరకూ అభివృద్ధి దిశగా నడిపించే సత్తా మోడీ కి ఉంది అనేది ఆసక్తికర విషయం. పెద్ద నోట్ల రద్దు తరవాత యావత్ దేశం మొత్తం మోడీ పట్ల నిరాసక్తత తెలుపుతోంది. ఆయన నిర్ణయం ఒకవైపు గా ఉన్నాయి అంటోంది సామాన్యుడి గొంతు.

నల్ల కుబేరుల పేర్లు బయటకి వస్తాయి అంటున్నారు కానీ ఎక్కడా ఎవ్వరూ బయటపడకపోవడం సామాన్యుడికి ఇంకా విసుగు తెప్పించే విషయం. నల్ల కుబేరులకు షాకిచ్చే ఉద్దేశంతో పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని మోడీ సర్కారు చెప్పినప్పటికి.. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉండటమే కాదు.. భారీ ఎత్తున అక్రమాలు బయటకు వస్తున్నాయి. పలుకుబడి.. సంపన్నులకు కరెన్సీ కష్టాలు దరి చేయటం లేదన్న విషయం.. అధికారులు జరుపుతున్న సోదాల్లో బయటపడుతున్న నోట్ల కట్టలు అసలు విషయాన్ని ఇట్టే చెప్పేస్తున్నాయి.

సామాన్యుడు రూ.2 వేల కోసం నానా పాట్లు పడుతుంటే.. అందుకు భిన్నంగా బడా బాబులకు మాత్రం కోట్లాది రూపాయిలు ఇళ్ల గుమ్మాలకే చేరిపోతున్నాయి. తమ సర్కారులో అవినీతి అన్నది లేదని చెప్పే మోడీ అండ్ కో.. పెద్ద నోట్ల రద్దు ఎపిసోడ్ లో చోటు చేసుకుంటున్న అక్రమాలకు ఏం సమాధానం చెబుతారన్నది ప్రశ్న. పెద్ద నోట్లను రద్దు చేసేసి.. కొత్త నోట్లను తెర మీదకు తీసుకురావటం ద్వారా.. నల్లధనానికి చెక్ చెప్పేయొచ్చన్న ప్లాన్ ఫ్లాప్ షోగా మారినట్లుగా కనిపిస్తోంది. సామాన్యుడి డబ్బులు బ్యాంకు డిపాజిట్లుగా మారిపోయి.. సొంత డబ్బులు వాడుకోవటానికి కూడా పరిమితుల మధ్య బండి నడిపించేయాల్సి వస్తోంది. మరోవైపు.. పెద్దోళ్లకు మాత్రం అందుకు భిన్నమైన వెసులుబాటు లభిస్తోంది. ఇలాంటి వాటికి చెక్ చెప్పేయటం.. నగదు కొరత లేకుండా చేసే విషయంలో మోడీ సర్కారు అడ్డంగా విఫలమైనట్లు చెప్పక తప్పదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -