Sunday, May 4, 2025
- Advertisement -

ఉగ్ర‌వాద జాబితాలో పాకిస్థాన్‌ను చేర్చిన పెద్ద‌న్న‌…

- Advertisement -

ఉగ్ర‌వాదాన్న పెంచిపోషిస్తున్న పాకిస్థాన్‌కు అంత‌ర్జాతీయంగా మ‌రో ఎదురు దెబ్బ‌త‌గిలింది. ఇన్నాల్లు ఉగ్ర‌వాదం విష‌యంలో ఏమి ఎరుగ‌న‌న్న‌ట్లు ఆ దేశం ఇప్పుడు క‌ష్టాల్లో ప‌డ‌నుంది. ఇప్పటికే ఉగ్రవాదంపై పోరులో భాగంగా పాకిస్థాన్ కు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేసిన అమెరికా… ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
పాకిస్తాన్‌కు అగ్రరాజ్యం అమెరికా ఊహించని షాకిచ్చింది. ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టాక పాక్ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న అమెరికా.. గట్టి ఝలక్ ఇచ్చింది. తాజాగా ఉగ్రవాదంపై పాక్‌ను అంతర్జాతియంగా దోషిగా నిలబెట్టింది పెద్ద‌న్న దేశం.
ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశాల జాబితాలో పాకిస్థాన్ ను కూడా చేర్చుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఏడాది జైషే మహ్మద్, లష్కరే తాయిబా తదితర ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్ లో స్వేచ్ఛగా విహరిస్తూ, నిధులను సేకరిస్తూ, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చాయని అమెరికా నిర్ధారించింది.
ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న ట్రాన్స్ సహారా, సోమాలియా, ఆఫ్ఘనిస్థాన్, సులవేసీ సీస్ లిట్టోరల్, దక్షిణ ఫిలిప్పైన్స్, ఇరాక్, లెబనానా, ఈజిప్ట్, యెమన్, లిబియా, వెనెజువెలా, కొలంబియాల సరసన పాకిస్థాన్ ను కూడా చేర్చింది. దీంతో, ప్రపంచ దేశాల దృష్టిలో ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్న దేశంగా పాకిస్థాన్ పేరు నమోదైంది.అంత‌ర్జాతీయంగా అందే స‌హాయం పాక్ కోల్పోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -