- Advertisement -
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను మర్యాదపూర్వకంగా కలిశానని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భేటీలో రెండు, మూడు అంశాలు చర్చకు వచ్చాయని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పనితీరు బాగానే ఉందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆచరణ సాధ్యంకాని వాటి గురించి మాట్లాడటంలేదని పవన్ కొనియాడారు. ఈ నెల 19న జరిగిన సమగ్ర సర్వే రోజు తాను హైదరాబాద్ లో లేనన్నారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విద్వేషాలు పెరిగేలా మాట్లాడటం వల్ల సమాజంలో అశాంతి పెరుగుతుందని ఆరోపించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబుల భేటీ ఆలస్యమైందన్నారు. త్వరలో 2 రాష్ట్రాల్లో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుపనున్నామని, గ్రేటర్ ఎన్నికలపై ఇంకా ఆలోచించలేదని పవన్ కళ్యాన్ పేర్కొన్నారు.