నా అభిప్రాయాలు నాకున్నాయి… నాయకులు నోరు పారేసుకుంటే ప్రజలకు అనర్థం.. కేసిఆర్ గారు తెలుగు జాతి ఐక్యతకు తొలి అడుగు వేశారు. దానికి నా కృతజ్ఞతలు…
Live Updates:
ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు మీద సిబిఐ విచారణ జరపాలి.
వర్తమాన పరిస్థితుల్లో ఏ పార్టీకి నీతి, నిజాయితీలు లేవు.
గత నెల రోజులుగా ప్రభుత్వాలు రెండూ పాలన మర్చిపోయి కోర్టులు, కేసులు అంటూ తిరుగుతున్నాయి.
‘నేను ఏది పడితే ఆది మాట్లాడనని.. అవసరమున్నప్పుడే ప్రశ్నిస్తానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. యాదాద్రి అభివృద్ధికి కోసం ఆంధ్రాకు చెందిన ఒక ఆర్కిటెక్ట్ ను నియమించిన సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతారణం మంచింది కాదన్నారు.
ప్రతిపార్టీకి సమస్యలు ఉన్నాయని.. అన్ని పార్టీల్లో అందరూ నిజాయితీపరులే లేరని పవన్ కళ్యాణ్ తెలిపారు. రెండు రాష్ట్రాలకు చాలా సమస్యలు ఉన్నాయని… ఆస్తుల పంపకాలు ఇంకా జరగలేదన్నారు. పొలిటికల్ గేమ్ కు అలవాటు పడడంతోనే పరిపోతుందని.. మరి ప్రజా సేవ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు
ఓ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోవచ్చు కానీ.. ఆ నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని చూరగొనలేరని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణలు అంతర్యుద్ధానికి దారి తీస్తాయని మోడీకి వివరించినట్లు చెప్పారు.
హైదరాబాద్ రాజధాని కాబట్టే సీమాంధ్ర ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని చెబుతూ ఆంధ్రోళ్లు, సెటిలర్లు అనే మాటలు ఉపయోగించవద్దని ఆయన తెలంగాణ నాయకులకు హితవు చెప్పారు. చంద్రబాబును తిట్టాలంటే తిన్నగా తిట్టండి, తెలుగుదేశం పార్టీని తిట్టాలంటే తిన్నగా తిట్టండి, నన్ను తిట్టాలంటే తిన్నగా తిట్టండి అంతేగాని ఆంధ్రోళ్లు అని తిట్టవద్దని ఆయన కోరారు.
తెలంగాణ సమస్య చాలా సున్నితమైన సమస్యని వివరించారు. ఆంధ్ర అనడం ఒక కులం కాదు.. అది చంద్రబాబు సామాజిక వర్గం కాదన్నారు.
పార్టీలు నేతలను ఆకర్షించవచ్చు గానీ, ప్రజలు ఆలోచనలను మార్చగలరా? అని ప్రశ్నించారు. ప్రస్తుత రాజకీయాల్లో నీతి, నిజాయితీ అసాధ్యమనిస్తోందని వ్యాఖ్యానించారు. రేవంత్ కేసు వ్యవహారంలో పూర్వాపరాలను పరిశీలించాల్సి ఉందన్నారు. దీనిపై కోర్టులో కేసు నడుస్తున్నందున స్పందించడం సరికాదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కోర్టులే నిజానిజాలు తేలుస్తాయన్నారు.