Wednesday, May 7, 2025
- Advertisement -

పవన్ అడుగులు బీజేపీవైపే..

- Advertisement -

జనసేనాని పవన్ కాషాయ దళం వైపు చూస్తున్నారా.? తాజాగా ఆయన మాటలు అదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. కొన్ని జాతీయ పార్టీలు తమతో కలిసి ప్రయాణం చేయాలని కోరాయని.. కానీ ఎవరితో ప్రయాణం చేసినా తమ పార్టీ లౌకిక పంథాను వీడదని పవన్ ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.

దీన్ని బట్టి బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చిందని ఆపార్టీలో చర్చ జరుగుతోంది. ఇటీవలే అమెరికాలో జరిగిన ‘తానా’ మహాసభలకు వెళ్లిన పవన్ ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కలిసి చర్చలు జరిపినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక పవన్ కళ్యాణ్ జనసేనను సైతం బీజేపీలో విలీనం చేసి ఏపీ బీజేపీ బాధ్యతలు చేపట్టాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా గతంలోనే కోరారట.. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో పవన్ తన జనసేనను విలీనం చేయకుండా బీజేపీతో పొత్తుతో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది.

ఏపీలో జనసేన కుదేలైంది. ఇప్పట్లో లేచే పరిస్థితి లేదు. బలమైన వైసీపీ, ప్రతిపక్ష టీడీపీని ఎదుర్కొని ఒంటరిగా అధికారంలోకి వచ్చే చాన్స్ అయితే కనిపించడం లేదంటున్నారు. స్వయంగా పవన్ కూడా ఓడిపోయారు. అందుకే బీజేపీ నుంచి వచ్చిన ఈ ఆఫర్ పైనే జనసేనాని తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం.

బీజేపీ కూడా ఏపీలో జగన్, చంద్రబాబుల చరిష్మాకు సరిసమానమైన వ్యక్తి కోసం ఎదురుచూస్తోంది. ఇప్పుడున్న బీజేపీని అధికారంలోకి తీసుకురావాలంటే పవన్ లాంటి వ్యక్తి అవసరం. అందుకే పవన్ కనుక వస్తే నెత్తిన పెట్టుకోవడానికి రెడీ అయ్యింది. మరి హోదా ఇవ్వలేదని ఎన్నికల ముందు బీజేపీని తీవ్రంగా విమర్శించిన పవన్ ఇప్పుడు ఆ పార్టీతో కలిసి నడుస్తారా లేదా అన్నది వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -